గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి
* సర్పంచులు ప్రజలతో కలిసి గ్రామాల వికాసానికి పాటుపడాలి
* వైకుంఠ ధామాల్లో సకల సౌకర్యాలు
* సుబ్బారెడ్డి గూడెంలో రూ.12లక్షల 60వేల నిధులతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని
ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి:
గ్రామాల సమగ్రాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. సర్పంచులు ప్రజలతో కలిసి గ్రామాల వికాసానికి పాటుపడాలని ఆకాంక్షించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని సుబ్బారెడ్డి గూడెంలో రూ.12 లక్షల 60వేలు నిధులతో సకల సౌకర్యాలతో నిర్మించిన అధునాతన వైకుంఠ ధామాలను భాస్కర్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లెల్లో ప్రగతి విప్లవం కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి తో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. రాష్ట్రంలోని పల్లెలు బాగుపడాలనే సంకల్పంతో నాలుగేండ్ల ప్రణాళిక కు సరిపడే విధంగా రూ.39,594 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణం కోసం మహాత్మాగాంధీ ఉపాధి హామీ నుంచి నిధులు కేటాయిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో ఎకరం స్థలాన్ని గుర్తించి నీడనిచ్చే, పూల, పండ్ల మొక్కల పెంపకం చేపడుతున్నామని భాస్కర్ రావు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, ఎంపీపీ నూకల సరళ-హనుమంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పులి జగదీష్, మండల పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, సర్పంచ్ గజ్జల జయమ్మ కోటిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సప్పిడి చంద్రా రెడ్డి, ఉప సర్పంచ్ బీసం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.