అమృత్ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు
* అన్ని వార్డుల్లో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలి
* నీటి కొరత ఉన్న వార్డుల్లో వాటర్ ట్యాన్క్ లు నిర్మించాలి : ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి:
అమృత్ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలని, తద్వారా మిర్యాలగూడ పట్టణంలోని ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆదేశించారు. పట్టణంలో పురపాలక కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో అన్ని వార్డుల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు. నీటి కొరత ఉన్న వార్డుల్లో తక్షణమే వాటర్ ట్యాన్క్ ల నిర్మాణాలను చేపట్టాలని అన్నారు. అన్ని వార్డుల్లో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, ప్రజారోగ్య ఎస్ఈ వెంకటేశ్వర్ రావు, ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, ఎన్సీపీఈ కన్సల్టెన్సీ ప్రతినిధి జమీర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.