గాంధీ కాదు గాడ్సే గా మారాడు…

గాంధీ కాదు గాడ్సే గా మారాడు…

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ

టిపీసీసీ ఎస్ సి సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో, వివేకానంద నగర్ డివిజన్ లో నిన్న దళిత బంధు ధనికులకు కాకుండా పేదలకు ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్లిన దళిత కాంగ్రెస్ నాయకుడు చిరుమర్తి రాజు పై దౌర్జన్యం చేసి దాడి చేసిన టీఆరెస్ నాయకులకి బుద్దిచెప్పడానికి ఈరోజు రాష్ట్ర దళిత అధ్యక్షులు నాగరిగారి ప్రీతం, వివేకానంద నగర్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇలాంటి దాడులు జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వ యత్రంగాన్ని హెచ్చరించారు . అదే విధంగా ఈ దాడి వెనకాల ఉన్న వ్యక్తులను వదిలేపెట్టే ప్రసక్తే లేదని , ఈ ఘటన పై హై కోర్టు ని ఆశ్రయీస్థామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ యాదవ్, బాషిపాక యాదగిరి, జైపాల్, రఘునందన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దండే శ్రీను, సూర్యప్రకాష్, రాజన్, శ్రీహరి, దుర్గేష్ ప్రదీప్, శివ,కవి, మోసిన్, సామ్ , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking