8ఏండ్లలో అద్భుత పారిశ్రామిక ప్రగతి

తెలంగాణలో 8ఏండ్లలో అద్భుత పారిశ్రామిక ప్రగతి
* మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు
* ప్రగతి శీల రాష్ట్రాలను అణగదొక్కుతున్న కేంద్రం
* టీ-ఎస్ ఐపాస్ ద్వారా రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడులు
* మిర్యాలగూడలో ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
* స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రం 8ఏండ్లలో అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధించిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయని అన్నారు. తెలంగాణ వంటి ప్రగతి శీల రాష్ట్రాలను ప్రోత్సహించకుండా కేంద్ర ప్రభుత్వం అణగదొక్కుతున్నదని విమర్శించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలను నాటారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన టీ-ఎస్ ఐపాస్ ద్వారా రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 16.48 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 6 పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపినా కేంద్రం నేటికీ స్పందించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. టీఎస్ ఐపాస్ తో తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కొనసాగుతోందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తోందన్నారు. ఒకవేళ 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు లభించకపోతే 16వ రోజు అనుమతి లభించినట్టుగా భావించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు భారత్ కు స్ఫూర్తిగా మారాయని అన్నారు.2014లో రూ.57,258 కోట్లు ఉన్న ఐటీ పెట్టుబడులు, 2019-20లో 1,28,807 కోట్లకు పెరిగాయని అన్నారు. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా స్వయం సమృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనల ఫలితంగా తెలంగాణలో పరిశ్రమల స్థాపన కోసం గణనీయంగా పెట్టుబడులు పెరిగాయని అన్నారు. మేకిన్ తెలంగాణ తో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలను కనబరుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఒక్కో నోటిఫికేషన్ జారీ చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, మధార్ బాబా, పాశం నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షులు జావిద్, ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పులి జగదీష్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమరథ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking