* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్…

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం
* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’
* మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా 50 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.22లక్షల 29వేల విలువైన చెక్కులు పంపిణీ : గుత్తా, భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా పట్టణానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ.22లక్షల 29వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వారు పంపిణీ చేశారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, మధార్ బాబా, కట్టా మల్లేష్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మక్దూమ్ పాషా, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షులు, కౌన్సిలర్ జావిద్, ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, మండల రైతుబంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, స్థానిక కౌన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి, నాయకులు పునాటి లక్ష్మీనారాయణ, పత్తిపాటి నవాబ్, బల్లెం అయోధ్య, సాధినేని శ్రీనివాస్, తిరుమలగిరి వజ్రం, పశ్య శ్రీనివాస్ రెడ్డి, బొడ్డు నంద కిషోర్ యాదవ్, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయ రాజు, సర్పంచ్ రవీందర్ నాయక్, ఈశ్వర్ నాయక్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking