*సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి* – వేములపల్లి ఎంపిపి పుట్టల సునీత కృపయ్య
అక్షిత ప్రతినిధి, వేములపల్లి :
ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశమున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమై వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపిపి పుట్టల సునీతకృపయ్య అన్నారు. ఆదివారం వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాల న్నారు. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, వైస్ ఎంపిపి పాదూరి గోవర్దని శశిధర్ రెడ్డి, ఎంపిడిఓ అజ్మీరా దేవిక, తహశీల్దార్ వెంకటేశం, ఎంపిఓ సంగీత, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి నుస్రత్,ఎంపిటిసిలు చలబట్ల చైతన్య ప్రణీత్ రెడ్డి, పల్లా వీరయ్యగౌడ్,సర్పంచులు చేర్కుపల్లి కృష్ణవేణి సుమన్, అనిరెడ్డి నాగలక్మి శ్రీనివాస్ రెడ్డి, దేశిరెడ్డి లక్మి, మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డి, వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్,మండల వ్యవసాయాధికారిణి మేకల ఋషిన్ద్రిమణి,వైద్యాధికారి డాక్టర్ స్ఫూర్తి,విద్యాధికారి బాలాజీ నాయక్, పశువైద్యాధికారి మిర్యాల సంపత్,పంచాయితీ రాజ్, గ్రామీణ నీటిసరఫరా ఎఈ లు ఆదినారాయణ, చిన్యానాయక్,ఎపీఎం అనోక్, ఉపాధి హామీ ఇంజనీరింగ్ మీరాజోద్దీన్,ఐసిడిఎస్ సూపర్ వైజర్ రాజరాజేశ్వరి,తదితరులు పాల్గొన్నారు.