ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్య సేవలు
రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆలోచనలు మేరకు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కన్నీరు హరీష్ రావు తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లతో సమీక్షించారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ల వారీ గా సమీక్షించి నట్లు తెలిపారు.మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు రేపటి నుండి ప్రాంభించనున్నట్లు తెలిపారు.సమీక్షాలో కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలిపారు .కొంత మంది డాక్టర్ లు అనుమతి లేకుండా గైర్హాజర్ అయినట్లు, కొంత మంది మధ్యాహ్నం వెళ్లినట్లు తెలిపారు.డాక్టర్ లు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తించాలని అన్నారు .ప్రభుత్వం సాయంత్రం కూడా ఓ పి సేవలు నిర్వర్తించాలని ఆదేశాలు ఇచ్చినందున డాక్టర్ లు అందు బాటు లో ఉన్న విభాగాలలో,అవసరమైన డిపార్ట్మెట్ లలో వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.ఇందుకు సేవలు అందిస్తున్న డాక్టర్ లకు ధన్య వాదాలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యా పేట,నల్గొండలో మెడికల్ కళాశాలలు స్థాపించడంతో పేదలకు వైద్య సేవలు అందు బాటులోకి వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి కె.సి.అర్ కే ఈ ఘనత దక్కుతుందని ఆయన తెలిపారు .కొత్త డైట్ కాంట్రాక్ట్ అమలులోకి వచ్చినందున రోగులకు నాణ్యమైన డైట్ మెనూ ప్రకారం అందించాలని అన్నారు.ఆసుపత్రులలో మందులు కూడా అందు బాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో 500 లోపు డెలివరీ లు జరుగుతున్నాయని,650 నుండి 750 కు పెంచాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.హైద్రాబాద్ కు రిఫరల్ కేసులు తగ్గించి ఆసుపత్రిలో వైద్యం అందించాలని, అత్యవసరమైతేనే హైద్రాబాద్ కు రిఫరల్ చేయాలని అన్నారు .ఆసుపత్రిలో ప్రీ డయాగ్న స్టిక్ పరీక్షలు, బ్లడ్ బ్యాంక్ పరీక్షలు త్వరిత గతిన నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.అర్తో పెడిక్ విభాగంలో 14 మంది డాక్టర్ కు ఉన్నట్లు,మోకాలు కీలు మార్పిడి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు,రోగులు ప్రైవేట్ ఆసుపత్రి లకు వెళ్లి డబ్బు లు ఖర్చు చేయకుండా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించు కోవాలని అన్నారు.డెంగ్యూ ,మలేరియా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ ప్లేట్ లెట్ లు తగ్గిన వారికి ప్లేట్ లెట్ లు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.డాక్టర్ లు రోగుల పట్ల ప్రేమ పూర్వకంగా వుండాలని అన్నారు.వారం రోజుల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఏడు కేషన్ రమేష్ రెడ్డి ఆసుపత్రికి వస్తారని, సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు.మెడికల్ కళాశాల విద్యార్థులు హాస్టల్, లైబ్రరీ,క్లాస్ రూం ల గురించి సమస్యలు తన దృష్టికి తీసుకు వచ్చారని,సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తానని ఆయన తెలిపారు .మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు, డి.సి.హెచ్.ఎస్.డా మాతృ నాయక్, ఆసుపత్రి సూపరింటెందెంట్ లచ్చు నాయక్,తదితరులు ఉన్నారు.