కసితో ప్రణాళికతో చదివితే గ్రూప్ వన్ ఉద్యోగం 

కసితో ప్రణాళికతో చదివితే గ్రూప్ వన్ ఉద్యోగం 

-తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి పార్థసారథి

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

పేదరికంలో ఉన్నామని తక్కువ మార్కులు వచ్చాయని తెలుగు మీడీయమని ఆలోచించకుండా కసితో ప్రణాళికాతో చదివితే గ్రూప్ 1 ఉధ్యోగం సాదించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి పార్థసారథి అన్నారు.నిన్న ఖమ్మం నగరం భక్త రామధాసు కళా క్షేత్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్ 1 ,2 సన్నద్దమయ్యో అభ్యర్దులకు దిశానిర్దేశం చేశారు.తెలంగాణలో భారీ స్థాయిలో గ్రూప్ 1 పోస్ట్ లు భర్తి చేస్తూన్నారని అభ్యర్దులు ఈ అవకాశాన్ని వినియోగించుకోని సాదించాలని పలు సూచనలు చేశారు.తను సైతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఓ సాదారణ కుటుంబంలో పుట్టీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివానని యావరేజీ స్టూడెంట్ ని గ్రూప్ 1 సాధించి ఐఎయస్ అధికారిని అయ్యానని తన స్వీయ అనుభవాన్ని విధ్యార్దులకు వివరించారు.అభ్యర్దులు మొబైల్ టీవీ సిన్మాలకు సీరీయల్స్ కు దూరంగా ఉండాలని సూచించారు.ప్రస్తుతం అనేక రకాల ఉధ్యోగ ప్రకటనలు సైతం వస్తూన్నాయని అభ్యర్దులు అందరు పుస్తకాలను భాగా చదివి విస్త్రతమైన పరిజ్ఞానం పెంపోదించుకోని పోటీ పరీక్షలలో విజయం సాదించాలని సూచించారు.
ప్రతి మనిషిలో ఏదో ఒక్క టాలెంట్ ఉంటుందని దానిని బయటికి తీయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ విపి గౌతమ్ మున్సిపల్ కమీషనర్ ఆధర్శ సురబీ ఎస్సీ సంక్షేమ డిడి కస్తాల సత్యనారయణ జిల్లా బీసీ సంక్షేమ అధికారిణీ గుడికందుల జ్వోతి జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహమూద్ ఎస్టీ సంక్షేమ అధికారి కృష్ణనాయక్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గోన శ్రీలత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టడీ సర్కిల్స్ విధ్యార్దులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking