సాగర్ కు జలకళ
ఆయకట్టుకు నేడు నీటి విడుదల
మంత్రి జగదీశ్వర్ రెడ్డిచేతుల మీదుగా విడుదల
నాగార్జునసాగర్, అక్షిత ప్రతినిధి :
సాగర్ జలాశయం నిందుకుండను తలపిస్తుంది. సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ నున్న ప్రాజెక్టులు నిండుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తుండ్రు. ఆయకట్టు సాగు నీటి అవసరాల నిమిత్తం ఎడమ కాలువకు గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేతులమీదుగా నీటిని విడుదల చేయనున్నట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరిండెంట్ ఇంజనీర్ ధర్మానాయకు తెలిపారు. సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటి విడుదల విషయమై మంత్రి జగదీశ్వర్ రెడ్డి బుధవారం రాత్రి నాగార్జునసాగర్ కు చేరుకుని గురువారం ఉదయం 10 గంటలకు శాస్త్రక్తంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.గత సంవత్సరం నీటి విడుదల తేదీ ఆగస్టు 5న జరగగా ఈ సంవత్సరం 8 రోజులు ముందుగానే ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతంలోని పై భాగంలోని ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయిలో నిండుకున్నాయి. దీంతో ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు సైతం ఆగస్టు మాసం కల్లా పూర్తిస్థాయిలో నిండి ఆయకట్టు ప్రాంతా రైతులకు రెండు పంటలకు సరిపోను వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు.