*నేటి పార్లమెంటు సభలోని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి*
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
మాదిగ, మాదిగ ఉప కులాల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సభలో చట్ట భద్రత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిలుకమారి గణేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ గొర్ల నరసింహ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తిపై జీవనం సాగిస్తున్న మాదిగలు డప్పు- చెప్పు కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాలకవర్గాన్ని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల భూములు ప్రభుత్వం తీసుకోవడాన్ని నిలుపుదల చేయాలని, నిరుపేదలకు భారమైన కరెంటు, ఆర్టీసీ చార్జీలు, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని, అన్ని గ్రామాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దండోరా నాయకులు జోగుల సాలయ్య, సుక్క పాపయ్య, కొమ్ము సైదులు, చెరుకు కృష్ణమూర్తి, కృష్ణయ్య, కడారి దేవేందర్, నకిరేకంటి యాదయ్య, చెరుకు మల్లేష్ తదితరులు ఉన్నారు.