75వ వజ్రోత్సవ పలు వేడుకల్లో పాల్వంచ బ్రహ్మా కుమారి పద్మజ
– గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న పద్మజ
భద్రాద్రి / అక్షిత బ్యూరో :
75 వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈ స్వేచ్ఛ వాయువులను అందించిన త్యాగమూర్తులను ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని బంగారు దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు.అనంతరం వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వారిని అభినందించారు వేడుకల్లో నృత్యం చేసిన చిన్నారులకు ఆత్మీయ అభినందనలు తెలిపారు.మనం ఈ భారత దేశంలో పుట్టడమే అదృష్టమని ఈ పుణ్యభూమిలో దేవతలు నడియాడారని ఇలాంటి దేశం రుణం తీర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరం భగవంతునికి దగ్గరగా జీవించాలని ఆమె కోరారు .
ప్రతి ఒక్కరు మెడిటేషన్ అలవాటు చేసుకోవాలని ప్రశాంతమైన జీవితాన్ని గడించాలని దానికోసం బ్రహ్మాకుమారీస్ పాల్వంచ వారిచే ఉచితంగా నేర్పుతుంది .