మారం ముత్తయ్య మృతి

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముత్తయ్య మృతి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మారం ముత్తయ్య (78) సోమవారం ఉదయం మరణించారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1986 నుండి 1994 వరకు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, అనంతరం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతికి స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గౌరు శ్రీనివాస్, బి.వెంకటరమణ చౌదరి బాబ్జీ, జి.శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గౌరు విజయ్ కుమార్ లు సంతాపం తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు చేసిన సేవలు మరువలేనివి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking