మల్లయ్య బట్టుపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

మల్లయ్య బట్టుపై
ఆరోపణలు చేస్తే సహించేది లేదు

తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు అమరారపు తిరుమలేష్ మాదిగ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ బిసి గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టుపై కొంతమంది ప్రజాప్రతినిధులు నిరాధారణ ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు అమరారపు తిరుమలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానికంగా మాట్లాడుతూ ఎందరో నిరుపేదల విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతున్న మల్లయ్య బట్టుపై నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఉన్నత విద్యను అందించడంతో పాటు ఉన్నత ఉద్యోగాలు పొందిన వారిగా చాలా మందిని తయారు చేసారని అన్నారు. గురుకులాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మల్లయ్య బట్టును ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking