ఖమ్మం చేరుకున్న ఆల్ ఇండియా టు వీలర్ సోలో డ్రైవ్ రమేశ్ చంద్రబాబు

ఖమ్మం చేరుకున్న ఆల్ ఇండియా టు వీలర్ సోలో డ్రైవ్ రమేశ్ చంద్రబాబు

-ఘనంగా సన్మానించిన కార్పొరేటర్ కర్నాటి కృష్ణ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో భాగంగా
హైద్రాబాద్ కూకట్ పల్లికి చెందిన తాతినేని రమేశ్ చంద్రబాబు(72 )ఆల్ ఇండియా టు వీలర్ సోలో డ్రైవ్ చేపట్టారు. దాదాపు 1,50,000 కిలోమీటర్లుగాను 1900 కిలో మీటర్లు పూర్తి చేసుకొని ఖమ్మం నగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ సారధ్యంలో లకారం ట్యాంక్ బండ్ పై రమేశ్ చంద్రబాబు ను ఘనంగా సత్కారించారు.ఆయన యాత్రను అభినందించారు. ముఖ్య అతిధిలుగా నగర మేయర్ పునుకొల్లు నీరజ అడిషనల్ డిసిపి సుభాశ్ చంద్రబోస్ సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ ఖమ్మం టౌన్ ఏసిపి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 1టౌన్ సిఐ చిట్టిబాబు చిరుమామిళ్ళ నాగేశ్వరావు సిసి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వసీం తాజ సాయి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking