కట్టుకున్నొన్ని కడతేర్చిన భార్య

వివాహేతర సంభందానికి అడ్దుగా ఉన్నాడని కట్టుకున్నోడిని కాటికి పంపిన భార్య

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఖమ్మం బైక్‌ లిఫ్ట్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు.ప్రధాన నిందితులైన జమాల్‌ సాహెబ్‌ భార్య ఇమామ్‌బీ సహా ఆటో డ్రైవర్ మోహన్‌రావు ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్ ఆర్ ఎంపి డాక్టర్ బండి వెంకట్‌లను అదుపులోకి తీసుకున్నారు.వ్యవసాయ కూలీ పనులకు మహిళలను ఆటోలో తరిలిస్తుండగా ఆటో డ్రైవర్ మోహన్‌రావు హిమాంబీ మధ్య పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం తో వారి మద్య అక్రమ సంభందం ఏర్పడింది.భర్త జమాల్ కి విషయం తెలిసి ఇద్దరిని హెచ్చరించాడు.దీంతో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంలో రెండు నెలల ముందే జమాల్‌ హత్యకు కుట్రపన్నారని తెలిపారు. భర్తను చంపేందుకు భార్య ఇమామ్​బీ ఇంట్లోనే ఇంజక్షన్‌ దాచిపెట్టిందని పోలీసులు చెప్పారు. దీంతోనే నిందితులు ఆర్ ఎంపి ట్రాక్టర్ డ్రైవర్ లు అతన్ని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ఈ నెల 19న ముదిగొండ మండలం వల్లభి సమీపంలో ఇంజక్షన్ దాడిలో మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న జమాల్‌ను వల్లభి ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు. దీంతో అతడిని బైక్‌పై ఎక్కించుకున్నారు. వెనక కూర్చున్న వ్యక్తి ఇంజెక్షన్‌ ఇవ్వడంతో జమాల్‌ మృతిచెందారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివాహేతర సంబంధమే దీనికి కారణమని నిర్ధారించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking