నాణ్యతలో రాజీవొద్దు

నాణ్యతలో రాజీవొద్దు
ఎస్సీ హాస్టల్ తనిఖీ
ఎంపిపి సరళ హనుమంతరెడ్డి

మిర్యాలగూడ టౌన్, అక్షిత న్యూస్ :

మిర్యాలగూడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. వంటల తయారిని చూసి, నాణ్యమైన భోజన విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాలలో ఫుడ్ పాయిజన్ ద్వారా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అందులో భాగంగానే తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థులకు అందించే భోజన విషయంలో రాజీపడొద్దని, నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. మెనూ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎ భరద్వాజ, వార్డెన్లు సావిత్రి, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking