మాడుగులపల్లి ఎస్ ఐగా నరేష్ కుమార్

మాడుగులపల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కైగూరి నరేష్ కుమార్
అక్షిత న్యూస్, మాడుగులపల్లి :

నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కైగూరి నరేష్ కుమార్ ఇక్కడ పనిచేస్తున్న కంచర్ల భాస్కర్ రెడ్డిని నల్గొండ రూరల్ బదిలీ చేస్తూ సూర్యాపేట సిసిఎస్ నుండి మాడుగులపల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి ఈరోజు మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ లో నూతన బాధ్యతలు చేపట్టిన కైగూరి నరేష్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న గుట్కా, ఇసుక, రేషన్ బియ్యం దందా, కోళ్ల పందాలు, భూ సెటిల్మెంట్లు పాల్పడిన వ్యక్తులను ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని తెలిపారు.  ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న నిర్భయంగా పోలీసు వారిని సంప్రదించవచ్చని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం మాడుగులపల్లి పత్రిక విలేకరులు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై కైగురి నరేష్ కుమార్ కు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్షిత రిపోర్టర్ దర్శనం రాంబాబు, ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎస్కే రసూల్ ,సామాజిక తెలంగాణ రిపోర్టర్ పొదిళ్ల నాగరాజు, నవతెలంగాణ రిపోర్టర్ వల్లబ్దాస్ రమేష్, మిర్యాలగూడ సూర్య రిపోర్టర్ కడియం కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking