గులాబీ గూటికి వలసలు

బంగారు తెలంగాణలో బాగస్వామ్యులు కావాలి

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ సాధనలో బాగస్వామ్యులు కావడానికి అనేక మంది టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ 11 వ వార్డు సభ్యుడు కొండేటి వెన్నెల వెంకన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు సమక్షంలో మిర్యాలగూడ మాజీ వ్యవసాయం మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్ , యాదగిరిపల్లి సర్పంచి దుండిగల యాదమ్మ శ్రీనివాస్, ఉపసర్పంచ్ సుధాకర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆంజనేయులు, యాదవ సంఘం డివిజన్ అధ్యక్షుడు చెమట ఎర్రయ్య, వార్డు సభ్యులు ఎల్లయ్య, వీరేశం, ఐనా, గుంటి గోపి, టిఆర్ఎస్ గ్రామ కార్యదర్శి కొండేటి రవి , యూత్ అధ్యక్షుడు నాగేంద్రబాబు, ఉపాధ్యక్షుడు వెంకట్ ఆంజనేయులు క్రాంతి, యేసు శ్రీను, ఏకమల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking