సంస్కృతికి ప్రతీక..బతుకమ్మ

సంస్కృతికి ప్రతీక..బతుకమ్మ

బతుకమ్మ చీరలు పంపిణీ

అక్షిత ప్రతినిధి, వర్ధన్నపేట : సంస్కృతి,సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని ఎం ఎల్ సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్ ఏ ఆరూరు రమేష్ లు అన్నారు. శనివారం వరంగల్ జిల్లా రూరల్ వర్ధన్నపేట మండలం రామవరం గ్రామంలో  బతుకమ్మ చీరల పంపిణీ, పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆరూరు రమేష్ లు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లెల ప్రగతే ధ్యేయంగా కేసిఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ర వెంకటరెడ్డి, ఎంపీటీసీ చిలుముల్ల సోమయ్య, కుల్లా సోమయ్య, దూకుడు రాజు, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గజ్జల నవీన్, యూత్ ప్రధాన కార్యదర్శి గజ్జల అనిల్, పార్టీ సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking