గులాబీని వీడి… నీలి దళం తీర్థం

బహుజన సమాజ్ పార్టీ లో భారీ చేరికలు

బహుజన రాజ్యం బీఎస్పీతోనే సాధ్యం

-బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డా.అల్లిక వెంకటేశ్వరరావు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

బహుజన సమాజ్ పార్టీ లో సోమవారం ఖమ్మం జూబ్లీక్లబ్ హాల్ జరిగిన సమావేశంలో భారీగా బహుజనులు భారీ సంఖ్యలో చేరారు.ముదిగొండ మండలం చిర్రుమర్రి నామవరం అమ్మపేట వల్లాపురం గ్రామాల నుండి టిఆర్ యస్ కాంగ్రెస్ సిపిఎం పార్టీల నుండి సుమారు 300 కుటుంబాలు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి.ఏన్నో అధికార పార్టీ ఆటాంకాల మధ్య వందల కుటుంబాలు బీఎస్పీ పార్టీలో చేరినవారి త్యాగాలను పట్టుదలను డా.అల్లిక వెంకటెశ్వరరావు అభినంధించారు.ఈ సంధర్బంగా జరిగిన సభలో అల్లిక మాట్లాడుతూ బహుజన రాజ్యం స్థాపించాలంటే బీఎస్పీ పార్టీతోనే సాధ్యమన్నారు. బహుజనులంతా ఐక్యమై ఖమ్మం జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు మేజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యధర్శి పిసి వీరస్వామి జిల్లా మట్టే గురుమూర్తి దామళ్ళ సత్యనారాయణ బుర్రా ఉపేందర్ శ్రీరాములు వృద్వీ రాంబాబు ఉదయ్ స్వెరో గద్దల నరసయ్య రజీనీ బాబురావు తదితురులు పాల్గొన్నారు.

*టిఆర్ ఎస్ నుండి బీఎస్పీలో చేరిన వెంకట్ నాగ ప్రసాద్*

ముదిగొండ మండలంలో అధికార టిఆర్ యస్ పార్టీకి షాక్ తగిలింది.టిఆర్ యస్ పార్టీ బీసి సెల్ నాయకులు చావగాని వెంకట నాగ ప్రసాద్ గౌడ్ బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అల్లిక వెంకటేశ్వర్లు సమక్షంలో 300 కుటుంబాలతో బీఎస్పీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా బీఎస్పీలో చేరిన వెంకట నాగ ప్రసాద్ మాట్లాడుతూ బహుజనులంతా బీఎస్పీ పార్టీలోకీ రావాలని మధిర నియోజకవర్గంలో ముదిగొండ మండలంలో బీఎస్పీ పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking