ముదిరాజుల మత్యశాఖ
దినోత్సవ వేడుకలు
చేర్యాల, నవంబర్ 21అక్షిత ప్రతినిధి : ప్రపంచ ముదిరాజుల సంఘ దినోత్సవం సందర్భంగా సోమవారం రోజు చేర్యాల పట్టణంలోని ముదిరాజ్ సంఘం భవనం వద్ద, పట్టణ ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు యాట యాదగిరి మరియు సొసైటీ అధ్యక్షులు యాట నాగయ్యల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు చింతల రవి, సెక్రటరీలో పుల్లన్నగారి బిక్షపతి, చింతల పరశురాములు, చెక్క మల్లయ్య, సింగరబోయిన రవి, పిట్టల స్వామి, యూత్ అధ్యక్షులు పుల్లన్నగారి రాజు, యాట చంద్రం, యాట బిక్షపతి, మరియు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.