ఓదార్పులు… బాధిత కుటుంబాలకు ఆదరణ

ఓదార్పులు… బాధిత కుటుంబాలకు ఆదరణ

ఎన్ బి ఆర్ ఫౌండేషన్ అధినేత సిద్దార్థ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలో రావులపెంట గ్రామానికి చెందిన శీలం శ్రీనివాస్ (51) మృతి చెందారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక నేతల ద్వారా శీలం శ్రీనివాస్ మరణవార్తను తెలుసుకున్న టీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ మృతుడి నివాసానికి చేరుకున్నారు. శీలం శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. సిద్దార్ధ వెంట ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి, ఉప సర్పంచ్ తరి సైదులు, వెంకటేశ్వర్లు, జగన్, శీలం సైదులు, షోయబ్, పాల్గొన్నారు.

 

క్లాస్మేట్ కుటుంబాన్ని
ఓదార్చిన యువనేత….

ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ క్లాస్మేట్ చిలక శంకర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిద్దార్ధ హౌసింగ్ బోర్డు కాలనీలోని శంకర్ నివాసానికి చేరుకున్నారు. అతడి కుటుంబ సభ్యులను నల్లమోతు సిద్దార్ధ ఓదార్చి మనోధైర్యం కల్పించారు. కాగా, మిర్యాలగూడ పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ లో యువనేత సిద్దార్ధ ఆరో తరగతి చదివినప్పుడు ఆయనకు శంకర్ క్లాస్మేట్.

తక్కెళ్ళపహాడ్ గ్రామానికి చెందిన లెంకలపల్లి లింగాచారి (51) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. చారి భౌతిక కాయానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి యువనేత నల్లమోతు సిద్దార్ధ నివాళి అర్పించారు.

మిర్యాలగూడ పట్టణంలో 33వ వార్డు అధ్యక్షులు గౌటే కనకయ్య తండ్రి యాదగిరి (75) గుండెపోటుతో మరణించారు. మృతుడి భౌతిక కాయాన్ని సిద్దార్ధ సందర్శించి నివాళి అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking