నాణ్యత ప్రమాణాలు పాటించాలి

నాణ్యత ప్రమాణాలు పాటించాలి

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాల ప్రకారం నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యం వెంటనే ప్రతి రోజు తూకం వేసి కొనుగోలు చేయాలని అధనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.బుధవారం నల్గొండ మండలం లోని బత్తాయి మార్కెట్,చందనపల్లి లో ఏర్పాటు చేసిన పి. ఏ.సి.ఎస్.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధనపు కలెక్టర్ సందర్శించారు.కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం వేసి లోడింగ్ చేయుటకు హమాలీ లు నిర్ణయించిన రేటు కంటే అదనంగా రైతుల నుండి వసూలు చేసినా,ధాన్యం తీసుకున్నా అట్టి హమాలీ ల లైసెన్స్ రద్దు పరచి అవసరమైతే బీహారీ హమాలీ లు ఏర్పాటు చేసుకుంటామని హెచ్చరించారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓ.పి.ఎం.ఎస్ లో రైతు వివరాలు నమోదు చేసి చెల్లింపు కు చర్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ప్రతి రోజు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షిస్తూ రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చెల్లింపులు త్వరగా ఖాతాలలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ఇప్పటి వరకు రైతుల నుండి 2,22,483 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 297 కోట్ల రూ.లు రైతుల ఖాతాలకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు.అదనపు కలెక్టర్ వెంట పౌర సరఫరాల శాఖ డి.యం.నాగేశ్వర్ రావు,మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking