రక్తదానం… మహాదానం

బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

మేడి ప్రియదర్శిని 

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

బుధవారం నకిరేకల్ సెంటర్లో జరిగిన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ప్రారంభించారు. వందలాది మంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తం దానం చేయడం విశేషం. అనంతరం ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆదర్శంగా తీసుకోవాలని వారి అడుగుజాడల్లో మనం పయనించాలని ప్రతి విద్యార్థి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్, లాంటి ఉన్నత ఉద్యోగాలు పొందాలని అలాగే వేల సంవత్సరాలుగా అంధకారంలోకి నెట్టబడిన జీవితాలలో విద్యతో వెలుగు నింపుతూ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్న జ్ఞాన యోధుడు అని అన్నారు.రక్తదానం మహాదానమని, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేస్తున్నదన్నారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.థలసేమియా, కేన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు.ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి 6 నెలలకొకసారి రక్తదానం చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున రక్త దానం శిబిరం ఏర్పాటు చేసిన బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ టీమ్ ను అభినందించారు. అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన బిఎస్పీ నాయకులకు, కార్యకర్తలకు ,యువతకు ప్రజలందరికీ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం భారీ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజీత్,నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ,మండల అధ్యక్షులు చేరుకుపల్లి శంకర్,ఉపాదక్షులు చిత్తలూరి శివ, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ముత్యాల రమేష్,నాయకులు నాగేళ్ళు జానకీరామ్,తెలంగాణ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ టిఎస్ ట్రాన్స్కో రూరల్ జోన్ సెక్రెటరీ జనరల్ చింత ఎల్లయ్య ,మేకల బిక్షమయ్య,
మేకల నరసింహ,ఎడ్ల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking