ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలో బుధవారం బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బిఎస్పీ పార్టీ మండల అధ్యక్షురాలు చుక్క పూజిత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం పారిశుద్ధ్యకార్మికులకు, వృద్ధులకు వికలాంగులకు, రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వారికి స్వీట్స్ , ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఈసందర్భంగా మండల అధ్యక్షురాలు చుక్క పూజిత మాట్లాడుతూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరు సంవత్సరాల సర్వీస్ ఉండంగా డీజీపీ అయ్యే అవకాశం ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి రాజీనామా చేసి బహుజనులు రాజ్యాధికారం చేరాలి అనే లక్ష్యంతో ముందుకు కాన్సిరాం అడుగుజాడల్లో నడుస్తూ బహుజనులు రాజ్యాధికారం కోసం బిఎస్పీ పార్టీ లో చేరారు అన్నారు.ఈ కార్యక్రమం లో గ్యార శేఖర్, ఎల్లేష్, మేడి రాజు, మేడి చరణ్,మంకాల శశి, వంశీ, ప్రసాద్, భాస్కర్, తేజ్, యాదయ్య, నర్సింహా, పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking