పోడు భూముల క్రమబద్ధీకరణ !

పోడు భూముల క్రమబద్ధీకరణకు సహకరించాలి
*ఎంపిపి సరళహన్మంతరెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

పోడు భూముల క్రమబద్ధీకరణకు సహకరించాలని స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు నూకల సరళ హన్మంతరెడ్డి కోరారు. గురువారం మిర్యాలగూడ మండలం జాలుబాయితండాలో పోడు భూముల గ్రామసభలో ఆమె మాట్లాడుతూ అర్హులైన వారందరికి‌ ధృవీకరణ పత్రాలు ఇస్తారని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలన అనంతరం సభలో వెల్లడించారు. సభలో ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ అనిల్ కుమార్, మార్కెట్ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, హన్మంతరెడ్డి, మండలం టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.సైదులుయాదవ్, సర్పంచ్ పద్మ, పిఎసిఎస్ చైర్మన్ వి.రామకృష్ణ దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking