పేదల చెంతకు ప్రభుత్వ విద్య

పేదల చెంతకు ప్రభుత్వ విద్య

మౌలిక వసతుల కల్పనకు
కస్తూరి ఫౌండేషన్ కృషి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మౌలిక వసతులు కల్పన కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న *కస్తూరి ఫౌండేషన్* ఈ విద్యా సంవత్సరంలో *అంగన్వాడి విద్యపై* దృష్టి కేంద్రీకరించడం జరిగింది.

దీనిలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ మండలంలోని జడ్ పి ఉన్నత పాఠశాల ఊట్లపల్లి, జడ్పీహెచ్ఎస్ ఆళ్లగడప, జడ్.పి.హెచ్.ఎస్ అన్నారం, ప్రాథమిక పాఠశాల అన్నారం ప్ర లోని 350 మంది విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ సహకారంతో ఫౌండేషన్ సభ్యులు గుడిపాటి కోటయ్య ,మెండె వెంకట్ స్టడీ కిట్లు, పాఠశాలలకు జాతీయ నాయకుల చిత్ర పటాలు, ఆట వస్తువులు, మైక్ సెట్ ఉపాధ్యాయులకు జూటు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా *గుడిపాటి కోటయ్య* మాట్లాడుతూ *పేదవారు విద్యకు దూరమైనప్పుడు విద్యయే పేదవారి చెంతకు వెళ్లాలని లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ స్థాపించి* గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పాఠశాలలో మౌలిక వసతులు కల్పన కోసం, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని భవిష్యత్తులో కూడా చేస్తామని అన్నారు.

ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాలికలను దృష్టి అందుంచుకొని బాలికలకు సంబంధించినటువంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని దానిలో భాగంగా బాలికల కు శానిటరీ నాప్కిన్స్, జూట్ బ్యాగ్ లు అందజేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మెండె వెంకట్, వీరనారయణ , మహేష్, ఆర్ కె,నవీన్, చిన్న నవీన్, జహాంగీర్ ప్రధానోపాధ్యాయులు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, మాలి సైదులు ఉపాధ్యాయులు శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking