బోనాల అనగానే తెలంగాణ ప్రజలు మనసులు పులకరిస్తాయి … వడ్డేపల్లి రాజేశ్వరరావు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనసులు పులకరిస్తాయని, భిన్న సంస్కృతులతో భిన్న భాషలతో మతసామరస్యానికి ప్రత్యేకంగా బోనాలు నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర టీటీడీ అడ్వైజర్ కమిటీ మెంబర్ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. ఆదివారం కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని ఫతేనగర్, కూకట్పల్లి, మోతి నగర్ , పాపిరెడ్డి నగర్, హనుమాన్ నగర్ నిర్వహించిన బోనాల పండుగకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ జాతి ఆస్థిత్వానికి ప్రత్యేకంగా నిలిచి బోనాల సంప్రదాయం అతి ప్రాచీనమనమని వర్షాకాలంలో అంటువ్యాధులు దరిచేరకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటూ చల్లగా చూడమని బోనం సమర్పించుకుంటారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచి మహేందర్ , సురేష్ తివారి , రాజు, ముదిరాజ్ , అబ్దుల్ బాకీ, మాధవరం రామ్మోహన్ రావు , తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘర్షణ ఉపాధ్యక్షుడు అంబాల మహేష్ గౌడ్, ఎం.విఠల్, కాసిం, శంకర్ సింగ్, బాలు యాదవ్, వెంకట్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్,శివ, రాములు, జోగారావు, అప్పారావు, లోహిత్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.