సమాజ సేవలో మాదిగలది త్యాగల చరిత్ర

సమాజ సేవలో మాదిగలది త్యాగల చరిత్ర…
మవర్గీకరణతోనే సామాజిక న్యాయం…
సూరారంలో వనభోజన కార్యక్రమంలో మాదిగల ఆత్మీయ కలయిక…

మేడ్చల్, అక్షిత బ్యూరో :
కార్తీకమాస చివరి రోజున మాదిగల వనభోజన కార్యక్రమం సూరారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని పలు ప్రాంతాలనుండి మాదిగలు,మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని మాదిగల చరిత్ర, సామాజిక అసమానతలు, దళిత ఉద్యమ కార్యాచరణ, విద్య, ఉపాధి కల్పన పై చర్చించారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా సమాజానికి సేవ చేస్తున్న మాదిగలది త్యాగాల చరిత్ర అని, గ్రామీణ ప్రాంతాలతో అన్ని కుల వృత్తుల వారికి మాదిగలు తొడ్పాటు అందించి సామజిక జీవనానికి వారధిగా నిలిచింది మాదిగలే అని గుర్తుచేశారు.మహనీయులు కలలు గన్న సామజిక న్యాయం జరగాలంటే ఎస్సి వర్గీకరణ జరగాలని, రానున్న రోజుల్లో మాదిగ మాదిగ ఉపకులాలకు, యువత కు, విద్యార్థులకు ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యత గురించి, రాజ్యాధికార సాధన పై చైతన్యం చేసేలా మాదిగలు ఐక్య ఉద్యమాలు చేయాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రం లోనే కుత్బుల్లాపూర్ సూరారం లో నిర్వహించిన మాదిగల వనభోజన కార్యక్రమం రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో జరుపనున్నట్టు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంజీవరావు, దుండిగల్ డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్,ఉప కులాల నాయకులు బుడగ జంగాల సంగం నాయకులు రాజలింగం,మాదిగ ల అనుబంధ సంఘాల నాయకులు ప్రేమ్ కుమార్,కిషన్ రావు, ఆనంద్ బాబు,ఏసురత్నం, విజయభాస్కరరావు, సిద్దయ్య, శ్రీనివాస్,అమర్ బాబు, అశోక్,ఎమ్మార్పీఎస్ నాయకులు రాసమల్ల యాదగిరి, రమేష్, జానయ్య, మహేష్,సివి రత్నం, ప్రజా కళాకారుడు మా పల్లె శంకర్, మాదిగ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking