కంటి వెలుగుతో అందత్వాన్ని నివారిద్దం ఛైర్మెన్ శుష్మ రెడ్డి
రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ కొలన్, సుష్మా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె స్థానిక కౌన్సిలర్ రాణి, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, తెరాస నాయకులు ప్రవీణ్ గౌడ్,లతో కలసి కంటి వెలుగు సెంటర్ ను ప్రారంభించారు.అనంతరం ఛైర్మెన్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం లో ఏఒక్కరు అందత్వం పాలు కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. కంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలలో కంటి పరీక్షలు నిర్వహించుకుని సమస్య నుంచి పరిష్కారాలు పొందాలన్నారు. ఉచితంగా ప్రభుత్వమే కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి మందులు అలాగే శాస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్న విషయాన్ని సుష్మ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష జరిగేలా ప్రజా ప్రతినిధులు అధికారులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని చైర్ పర్సన్ సుష్మ మహేందర్ రెడ్డి అన్నారు. కంటి వెలుగు నిర్వహించేందుకు మన వార్డులలో కావలసిన వసతులు దగ్గరుండి కల్పించాలి. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళద్దాలు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు మందులను అవసరమైన వాళ్లకి కళ్ళజోడు అలాగే అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువానాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.