అగ్ని ప్రమాద కుటుంబానికి అండగ బీఆర్ఎస్ మండల అద్యక్షులు, ఉపాధ్యక్షులు

అగ్ని ప్రమాద కుటుంబానికి అండగ బీఆర్ఎస్ మండల అద్యక్షులు, ఉపాధ్యక్షులు

పినపాక అక్షిత ప్రతినిధి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురై మెంతిని బాబు ఇల్లు పూర్తిగా దహనమైంది, విషయం తెలుసుకున్న కరకగూడెం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థికంగా వెనకబడి రెక్క ఆడితెనే డోక్కనిండని పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి ఆర్దికంగా 6500 రూపాయల విలువగల వంట సామాగ్రిని అందించడం జరిగింది. ఈ సంద్భంగా మాట్లాడుతు పార్టీ తరపున వస్తున్న సంక్షేమ పథకాలలో అర్హత ఉన్న ప్రతి పథకాన్ని లబ్ధి పొందే విధంగా పార్టీ అండగా ఉంటుందనీ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, ఉపాధ్యక్షులు జాడి రామనాధం, ఎంపీటీసీ కొమరం సురేష్, స్థానిక ఉపసర్పంచ్ బోడ ప్రశాంత్, సీనియర్ నాయకులు చెప్పిన వెంకటేశ్వర్లు, తోలెం వీరస్వామి, బోడ రామారావు, కొండగొర్ల నరసింహారావు, కార్యకర్తలు కీసరి ముసలయ్య, నరసింహారావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking