సీఎం సహాయనిది పేదలకు వరం ఆమనగల్ మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాసరెడ్డి
కల్వకుర్తి,అక్షిత ప్రతినిధి : సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం అని మార్కెట్ చైర్మన్ నాగపురం శ్రీనివాస్ రెడ్డి అన్నారు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయతీ కి చెందిన కె ముకేశ్, కీ 50000 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఆరోగ్యంగా ఉండడానికి సీఎం సహాయనిధి ఎంతో మేలు చేకూరుస్తుందని నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో చెన్నారం సర్పంచ్ తీపిరెడ్డి స్వప్న భాస్కర్ రెడ్డి, చుక్కపూర్ ఎంపీటీసీ నాలాపురం వందన శ్రీనివాస్ రెడ్డి, తదితరులూ పాల్గొన్నారు