మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

డా. విజయలక్ష్మీ

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:

పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఐఎంఏ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డా. విజయలక్ష్మి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు.

పటిష్ట చట్టాలు వచ్చిన మహిళలపై అత్యాచారాలు, దాడులు మాత్రం ఆగడం లేదన్నారు.అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మహిళపై జరుగుతున్న వివక్షతను దాడులను ‘ధీర’ అనే వీడియో విజువల్ ద్వారా విద్యార్థినిలకు తెలియజేశారు.మహిళలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు.ఈ సంవత్సరం తీసుకున్న అంశాలను విద్యార్థినిలకు వివరించారు. ఇన్నోవేషన్ ఫర్ ఉమెన్ ఈక్విటీ ప్రోగ్రామ్ యొక్క దశ దిశలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఐఎంఏ మహిళ విభాగం సెక్రటరీ డా. అరుణ జ్యోతి,సైకాలజిస్ట్ డా. వరలక్ష్మి ,డాక్టర్లు సంధ్య, క్రాంతి, మాధవి, ప్రమీల, దుర్గాబాయి, ఝాన్సీ, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking