సామాజిక సేవా శిఖరం ‘మునీర్’

ఘనంగా ‘జనయేత్రి’ అధినేత పుట్టినరోజు వేడుకలు
* సామాజిక సేవా శిఖరం ‘మునీర్’
* అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతున్న ఆయన సేవా కార్యక్రమాలు
* పుట్టినరోజు సందర్భంగా 50 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్ల పంపిణీ అభినందనీయం

మధుసూదన్ రెడ్డి 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తన పూర్వ విద్యార్థి, జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సామాజిక సేవా శిఖరమని మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున విద్యా సంస్థల (డిగ్రీ& పీజీ కళాశాల) చైర్మన్ అనుముల మధుసూదన్ రెడ్డి అభివర్ణించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆయన నిర్వర్తిస్తున్న సేవా కార్యక్రమాలు చేరువవుతున్నాయని కొనియాడారు.

శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ వద్ద డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్, ఏఎస్సై పల్లె కిషోర్ తో కలిసి పాల్గొని అనుముల మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఏడాది డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన టీమ్
రాజీవ్ చౌక్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.

మిర్యాలగూడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న నేపథ్యంలో ఈఏడాది చలివేంద్రం ప్రారంభించడానికి బదులుగా 50 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ చేయాలనే ఆలోచన మహోన్నతమైనదని కొనియాడారు. పలు ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ చేసిన డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఔదార్యం గొప్పదని అభినందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జనయేత్రి ఫౌండేషన్ కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్నాయని అన్నారు.జనయేత్రి ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదగాలని అనుముల మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరో రోగులకు రక్తదానం చేసి జనయేత్రి సభ్యులు ప్రాణదాతలుగా నిలుస్తున్నారని అభినందించారు. అదే విధంగా, ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కోరారు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, జనయేత్రి అధినేత పుట్టినరోజు ఒకే రోజు కావడం అందరికీ గుర్తుండిపోతుందన్నారు. డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ నిండు నూరేండ్లు ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, సమాజ సేవలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనయేత్రి ప్రెసిడెంట్ నర్సింహ, కార్యదర్శి సంజీవ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొగుల సందీప్, సుదర్శన్ రెడ్డి, జాజుల కృష్ణ, షేక్ అహ్మద్ సార్, జనయేత్రి సభ్యులు వెంకట్ రామ్ నాయక్, ఉపాధ్యక్షులు తాజ్ బాబా, సహాయ కార్యదర్శులు అమీర్ అలీ, కళ్యాణ్ రెడ్డి, పగిల్ల కళ్యాణ్, యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, జానీబాబా, రమేష్, రషీద్, ప్రశాంత్, రమేష్, శిరోజ్, బాబా, సాయి చరణ్, నాగయ్య, పాషా, ఖదీర్, భద్రయ్య, శ్రీనివాస్, ద్రోణాచారి, హుస్సేన్, కిరణ్ రెడ్డి, మదీహా, ఫాతిమా, నాగరాణి, శాంతాబాయ్, తులసీ, జరీనా, నందిని, సైదమ్మ, ఫిరోజా, కావ్య, ఉమా, నోషీన్, రూబీన, రుహీన, రెహానా, స్వాతి, కరిష్మా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking