రాజ్యాంగ పరిరక్షణకు నడుంబిగించాలి

*భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలి*
*-డివైఎఫ్ఐ*

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

భాతరదేశంలో మతోన్మాద ప్రమాదం మితిమీరి,భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందని నేడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం యువత ముందుండి పోరాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, రామన్నపేట మండల వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్ అన్నారు. ఏప్రిల్ 13న జిల్లా కేంద్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే భారత రాజ్యాంగ పరిరక్షణ బైక్ ర్యాలీ జయప్రదం కోసం మండలం లోని నీర్నెముల గ్రామంలో ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాద భావాజలం రోజు రోజుకు పెరిగిపోతూ ఐక్యమత్యంగా కలిసి ఉన్న మనుషుల మధ్య కులాల, పేరుతో,మతాల పేరుతో వైషమ్యాలు పెంచి అల్లర్లకు దారి తీరుస్తున్నారని వారు అన్నారు. మహానీయులు బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలను చెప్పకుండా, వారి త్యాగాలను మరుగున పెట్టి హిందుత్వ ఎజండాను ముందుకు తీసుకురావాలని చూస్తున్నారని వారు అన్నారు. ఈ నేపథ్యంలో మహనీయులు జయంతులను పురస్కరించుకుని ఏప్రిల్ 13న యాదాద్రి జిల్లా కేంద్రంలో జరిగే బైక్ ర్యాలీ ని జయప్రదం చేయాలని కోరారు.వీరితోపాటు నాయకులు ఏభూషి రవి, బోయిని రామచంద్రం, పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking