విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభను చూపాలి
ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో ప్రతిభను చాటాలని వేములపల్లి ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య జెడ్పిటిసి ఇరుగు మంగమ్మవెంకటయ్యలు అన్నారు. శుక్రవారం వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడల పోటీలకు సెలక్షన్ కార్యక్రమం నిర్వహించారు. అందులోభాగంగా వాలీబాల్ క్రీడను వేములపల్లి జడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గోవర్ధనశశిధర్ రెడ్డి స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మండల విద్యాధికారి బాలాజీనాయక్, ఉపాధ్యాయులు అరుణ, మహమ్మద్ ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.