పేదల మనసు గెలిచిన కృష్ణవేణి

పేదల మనసు గెలిచిన కృష్ణవేణి

వైద్య శిబిరంలో వక్తల ఉద్ఘాటన

నూతనకల్, అక్షిత న్యూస్ :
తుంగతుర్తి నియోజకవర్గంలో కృష్ణవేణి ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, మందుల పంపిణీ చేస్తున్న చేస్తున్న కృష్ణ వేణి ఇస్మాయిల్ పేదల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారని మాజీ ఎంపీపి ఎన్ జానయ్య, మాజీ సర్పంచ్ రవి, ఫాదర్ జీవన్, కంభం రాములు అన్నారు అరోగ్య మాతా జయంతి ఉత్సవాల సందర్భంగ లింగంపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం ఉచితంగా మందుల పంపిణీ కార్య్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి పేద మధ్యతరగతి ప్రజల కోసం ఉచిత వైద్య ఆరోగ్య సేవలు అందిస్తూ పల్లె పల్లెలో శిబిరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆదర్శవంతమైన మార్గంలో అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రజలకు చేరువగా ఉంటూ సేవలు చేస్తున్న కృష్ణ వేణికి అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అనిల్, విజయ స్వర్ణ, రూబీ, సునీత,లత,రమణ, పిట్టల మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగ పరిసర ప్రాంతాల ప్రజలు 200మంది కి ఉచిత వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ చేశారు కృష్ణ వేణి ఇస్మాయిల్ లను స్థానికులు ఘనంగా సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking