దేశ భవిష్యత్తును
తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
దేశంలో ఉత్తమ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎనలేనిదని దుర్గాబాయి దేశముఖ్ నర్సింగ్ కళాశాల చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎం. సులోచన అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా లీనేస్ స్వరీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశముఖ్ బిఎస్సీ నర్సింగ్ కళాశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను బుధవారం ఘనంగా సత్కరించారు. ఆలిండియా లీనేస్ సర్వీస్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ భాగ్య నగర్ టీఎస్..1 అధ్యక్షురాలు లినేస్ విజేత. బి అధ్యక్షత వహించగా ఏఐఎల్ఎస్ మాజీ అధ్యక్షురాలు లినేన్ టి. స్వర్ణలత, ప్రొగ్రాం చైర్పర్సన్ లీనేన్ వి. సురేఖ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని అన్నారు. ఉపాధ్యాయులు అక్షరాభ్యాసం నుంచి మొదలుకుని ఉన్నత విద్య వరకూ మార్గ నిర్ధేషణం చేయడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. దేశంలో, సమాజంలో ఇతరులను మంచి వైపు నడిపించే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని కొనియాడారు. కార్యక్రమంలో లినేన్ ఆర్గనైజేషన్ భాగ్యనగర్ డిస్ట్రిక్ట్ ఉపాధ్యక్షులు ఎ. శైలజారామ్, రెబెకా సుందర్ తదితరులు పాల్గొన్నారు.