ఖమ్మంలో ఘనంగా మమత మెడికల్ కళాశాల రజతోత్సవ వేడుకలు
-ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి హరీష్ రావు
-ఘనంగా పువ్వాడ నాగేశ్వరరావు 85 వ జన్మదిన వేడుకలు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మమత మెడిక కళాశాల భవనం-సిల్వర్ జూబ్లీ బ్లాక్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వైద్య విద్యా సంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు 85 వ జన్మదిన వేడుకలు మమత వైద్య విద్యా సంస్థల రజతోత్సవ వేడుకల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వర రావు కేక్ కట్ చేశారు. అనంతరం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మమత వైధ్య కళాశాల సెక్రటరీ పువ్వాడ జయ శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు మనవళ్ళు పువ్వాడ నయన్ పువ్వాడ నరేన్ లు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎంపి నామ నాగేశ్వరరావ రాజ్య సభ సభ్యులు రవిచంద్ర బండి పారధి సారధీ జిల్లా లోని పలువురు ఎమ్మేల్యేలను మమత వైధ్య కళశాల తరపునా శాలువలతో సత్కరించి మెమోంట్ లు అందించారు.ఘనంగా రజతోత్సవ వేడుకుల అంగరంగ వైభవంగా నిర్వహించారు.