నకిరేకల్, అక్షిత ప్రతినిధి: గొర్రెలు, పశువుల యజమానులు ఉచిత పశువైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నీర్నేముల గ్రామ సర్పంచ్ ముత్యాల సుజాతరవి కోరారు. మంగళవారం గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు గర్భకోశవ్యాధి నివారణ క్యాంప్ ను గ్రామ సర్పంచ్ ముత్యాల సుజాత వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉచిత గాలికుంటు నివారణ టీకాలు నష్టుల నివారణ మందులు 112 పశువులకు ఇవ్వడం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో డిఎల్డిఏ ఏడి డాక్టర్ పాశం శ్రీనివాసరెడ్డి, రామన్నపేట ఏరియా పశువైద్యశాల ఎడి డాక్టర్ సంజీవ్ రావు, మండల పశువైద్యులు డా శ్రీధర్ రెడ్డి, డా. శాంతి బాబు, పశువైద్య సిబ్బంది యాదయ్య, శ్రీనివాస్, నరేష్, భాను, రాజేందర్, గోపాలమిత్రులు సురేష్, నర్సింహ, మల్లేష్, ముత్తయ్యలు, పాలసంఘం -చైర్మన్ జెట్టి వరమ్మయాదయ్య, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.