పేదల ఆశల సౌధం…డబుల్ ఇళ్లు

పేదల ఆశల సౌధం…డబుల్ ఇళ్లు

సొంతింటి కలకు సాకారం

దుండిగల్ లో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా 2వ విడత
డబుల్ ఇళ్ళ పంపిణి

9 ఏండ్లలో కుత్బుల్లాపూర్
ప్రగతికి బోలెడన్ని నిధులు

ఎమ్మెల్యే కేపి వివేకానంద్

మంత్రి కేటిఆర్

మేడ్చల్, అక్షిత బ్యూరో :

పేదల ఆశల సౌధం…డబుల్ ఇళ్లని రాష్ట్ర పురపాలక, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో రెండో విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు. లక్కీ డ్రాలో పేరు రాని వారు నిరుత్సాహనికి గురికావద్దని, మిగతా వారికి కూడా ఇళ్లను ఇస్తామని, తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తాని తెలిపారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా కేసిఆర్ నాయకత్వంలో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమంగా నిలిచిందన్నారు.

గడిచిన 9 ఏండ్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు మంచినీటి గోస తీర్చామని, అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలను అందించామన్నారు. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసిఆర్ ని, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కెపివివేకానంద్ ని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపైన మాట్లాడే దమ్ములేకే ప్రతిపక్ష పార్టీలు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తొలుత ఎమ్మెల్యే కేపి వివేకానంద మాట్లాడుతూ గడిచిన 9 ఏండ్లలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని, నియోజకవర్గం పరిధిలోని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిఎచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోజ్, జోనల్ కమీషనర్ మమత,నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ సుంకరి సుంకరి వేణి కృష్ణ, వైస్ చైర్మన్ పద్మారావు, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ లు , మున్సిపల్ డివిజన్ ల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking