సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లధ్నుర్ వైద్యాధికారి స్టువార్డ్ సన్
మద్దూరు, అక్షిత న్యూస్:
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సీజనల్ లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లద్నుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి స్టువార్డ్ సన్ కోరారు.ఈ సంధర్భంగా అయన మాట్లాడుతు వర్షాకాలంలో గ్రామంలోని ఇళ్ల ముందు నిలిచిన మురికి నీరు ద్వార దోమలు విపరీతంగా పెరిగి సాయంత్రం పూట ఇళ్లలోకి చేరీ దోమలు కాటు వేయడంతో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ప్రజలు వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఎటువంటి వ్యాధికి గురైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకొని ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేసిన మందులను వాడి మెరుగైన ఆరోగ్యం పొందాలని వైద్యాధికారి స్టువార్డ్ సన్ కోరారు.