మంత్రి పట్నంకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

మంత్రి పట్నంకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

కేక్ కట్ చేయించిన ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రి డా.పట్నం మహేందర్ రెడ్డికి జన్మదినం సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కె అశోక్ రెడ్డి, శాఖ డైరెక్టర్ బి రాజమౌళిలు మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి, పూల బోకే అందజేశారు.

సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డెరైక్టర్ నాగయ్య కాంబ్లే , సిఐ ఈ రాధా కిషన్ , జాయింట్ డైరెక్టర్ లు జగన్, శ్రీనివాస్, మీడియా అకాడమీ సెక్రెటరీ వెంకటేశ్వరరావు, ఆర్ ఐఈలు రాములు, జయరాoమూర్తి , డెప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి,హష్మీ, ప్రసాదరావు ,డిఈఈ లు, ఇతర అధికారులు, సిబ్బంది మంత్రివర్యులు మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking