తెలంగాణ సంస్కృతికి
ప్రతీక బతుకమ్మ
పువ్వులను పూజించే
పండుగ బతుకమ్మ
మిర్యాలగూడ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. రాధ
*ఎస్ ఆర్ డి జి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ ప్రకృతిని ఆరాధిస్తూ రంగు రంగుల పువ్వులను గౌరమ్మగా ఆరాధిస్తూ జరుపుకునేటువంటి పండుగే బతుకమ్మ, స్థానిక ఎస్ఆర్డిజీ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మిర్యాలగూడ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి.రాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ గౌరీదేవిని ఆటపాటలతో పూలతో పూజించే వేడుక బతుకమ్మ పండుగ అని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ పుట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ, రంగురంగుల పువ్వులను గౌరమ్మగా ఆరాధిస్తూ మహిళలందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఈ సందర్భంగా విద్యార్థులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
బతుకమ్మ పోటీలలో విజేతలైన మహిళలకు పాఠశాల యాజమాన్యం తరఫున ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాధూరి గోవర్ధని శశిధర్ రెడ్డితో కలిసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పలు రకాల పువ్వులతో బతుకమ్మలను అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చలమల్ల సరస్వతి, అజ్గర్, రఫీ, విజయలక్ష్మి, రామకృష్ణ, శ్రావణి, అశోక్ ,లతీఫ్, రమేష్ , సుధా, నేహా, సంజన, వాణి, వసంత, నాగలక్ష్మి, రమ్య ,అనిత, శోభ, మామిడి శిరీష, చల్ల శిరీష, మహమ్మద్ మునీర్, పి.ఈ.టి దుర్గాప్రసాద్ మరియు విద్యార్థులకు తల్లిదండ్రులు పాల్గొన్నారు.