ఎలక్షన్ కోడ్ తో లైసెన్స్, ఆయుధాలు స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి

ఎలక్షన్ కోడ్ తో లైసెన్స్, ఆయుధాలు స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్,ఎస్.పి.అపూర్వ రావు తెలిపారు.. గురువారం జిల్లా కలెక్టర్,ఎస్.పి.లతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి లైసెన్స్ కలిగిన ఆయుధాల పై సమీక్షించారు.

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లైసెన్స్ ఆయుధాలు కలిగిన ప్రతి ఒక్కరూ సంబంధిత పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలని వారు తెలిపారు.బ్యాంక్ లలో రక్షణ, క్రీడా ఈవెంట్ లు నిమిత్తం తప్ప మిగతా వ్యక్తులు తమ ఆయుధాలు డిపాజిట్ చేయాలని వారు సూచించారు
ఆయుధాలు, డిపాజిట్ చేయని వారిపై ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పారదర్శకంగా విష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ గురించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాలని వారు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking