ఎంపి బడుగుల నిధులతో
ఓపెన్ జిమ్
సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సహకారం, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ నిధులతో వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ పంచాయతీ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ ఇచ్చిన మాటకు కట్టుబడి పది రోజుల్లోనే ఓపన్ జిమ్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలను అందించి అహ్లాదకరమైన వాతవారణంలో ఓపన్ జిమ్ ఏర్పాటు చేయడంతో యువకులు తమ దేహదారుఢ్యాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్వారు.రావులపెంట గ్రామ ప్రజలపక్షాన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలుతెలియజేశారు .