ఎన్నికల నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి-ఎస్ ఐ పరమేష్
సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
నేరేడుచర్ల, అక్షిత న్యూస్:
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని నేరేడుచర్ల ఎస్సై పీ పరమేష్ అన్నారు. పట్టణ మరియు గ్రామాలలో యువతి యువకులు, ప్రజలకు గురువారం నేరేడుచర్ల పోలీస్ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో వాట్సాప్,ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతరత్రా గ్రూపులపై ఇతర వ్యక్తులు పార్టీలను రెచ్చగొట్టేవిధంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని, గ్రూప్ అడ్మిన్ లు అందరూ మీ మీ గ్రూపులలోని సభ్యుల గురించి తెలుసుకొని పై విధమైన చర్యలకు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంటే అలాంటి వారిని గ్రూప్ నుంచి తొలగించాలని, లేనియెడల వాళ్ళు చేసే చర్యలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి వస్తుంది తెలిపారు.