విజయానికి ప్రతీక.. విజయ దశమి
మాడుగులపల్లి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు
అక్షిత న్యూస్, మాడుగులపల్లి:
తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకని మాడుగుల పల్లి మండల ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు అన్నారు. మాడుగులపల్లి మండల ప్రజలకు
దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదు అనే స్ఫూర్తితో చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా విజయదశమి జరుపుకుంటామని పేర్కొన్నారు.దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని పేర్కొన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని వారు చెప్పారు. సిఎం కేసిఆర్ నాయకత్వంలో అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే భాస్కర్ రావు తోనే,నల్గొండ నియోజక వర్గం భూపాల్ రెడ్డి తోనే,సాగర్ భగత్ తోనే,అభివృద్ధి సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోనే మూడు నియోజక వర్గాలు న అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచాయి అన్నారు.విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని ప్రార్థించారు. విజయ దశమి స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ఆయురారోగ్యాలు,సిరిసంపదలతో జీవించేలా మండల ప్రజలను దీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.