కంచర్ల సతీమణి రమాదేవి ప్రచారం 

కంచర్ల సతీమణి రమాదేవి ప్రచారం 
అక్షిత న్యూస్, నల్గొండ/మాడుగుల పల్లి:
బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి కనగల్ మండలం ధర్వేశిపురం లో రేణుక ఎల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

పట్టణంలోని పలు వార్డులలో ఉన్న అపార్ట్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పూజిత అపార్ట్మెంట్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నల్లగొండ అభివృద్ధిని చూసి భావితరాల భవిష్యత్తు కోసం కెసిఆర్ ప్రభుత్వాన్ని బలపరచాలని నలగొండ పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని… కొనసాగాలంటే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి రెండోసారి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ ఓ మాలే శరణ్య రెడ్డి, మాజీ ఎంపీపీ రజిత రెడ్డి, మందడి లిఖితాసైదిరెడ్డి, కవిత,కున్ రెడ్డి సరోజ కత్తుల సంధ్య, కంచర్ల విజయరెడ్డి, తదితరులు వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking