అభివృద్ధి, సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి…
–ప్రభుత్వ విప్. ఎమ్మెల్సీ.ఎమ్మేల్యే …
మేడ్చల్, అక్షిత బ్యూరో:
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 130-సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్, ముఖ్య నాయకులతో శనివారం.ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మేల్యే కే.పీ.వివేకానంద్. సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా.మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సీ ఎం కెసిఆర్ నాయకత్వములో పురపాలక మంత్రి కేటీఅర్ సహకారంతో కుత్బుల్లాపూర్. నియోజికవర్గం లో కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారంలో విస్తృతంగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ విజయంతో గెలిపించుకో వాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…